నల్సార్ యూనివర్సిటీ ఆఫ్‌లా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌కు సమీపంలో ఉన్న ఈ వర్సిటీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఫ్యాకల్టీతో పాటు అకడమిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (31-03-2023) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 58 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్) (10), అసోసియేట్ ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్) (12), అసిస్టెంట్ ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్) (33), డైరెక్టర్(డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్) (01), హెడ్, కార్పొరేట్ ఇంటర్‌ఫేస్ (01), ప్లేస్‌మెంట్ ఆఫీసర్ (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఐజీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు నెట్/ స్లెట్/ సెట్ అర్హత పాటు పని అనుభవం ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు రూ.750, ఇతరులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ నేటితో (31-03-2023)తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..