NALCO Recruitment 2022: నాల్కోలో 375 ట్రేడ్ అప్రెంటిస్‌ ఖాళీలు.. టెన్త్‌/ఐటీఐలో అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు..

|

Nov 22, 2022 | 4:48 PM

కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిశాలోని అంగుల్‌లోనున్న నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి.. 375 ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

NALCO Recruitment 2022: నాల్కోలో 375 ట్రేడ్ అప్రెంటిస్‌ ఖాళీలు.. టెన్త్‌/ఐటీఐలో అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు..
NALCO Apprentice Recruitment 2022
Follow us on

కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిశాలోని అంగుల్‌లోనున్న నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి.. 375 ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిట్టర్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, పీఏఎస్‌ఏఏ, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర ట్రేడుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఏడాది పాటు కొనసాగే ట్రైనింగ్‌కు పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఫిజిక్స్/కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నాల్కో పనిచేస్తున్న ఉద్యోగులు, మాజీ నాల్కో ఉద్యోగుల పిల్లలు, మనవళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న అప్లికేషన్‌తోపాటు సంబంధిత డాక్యుమెంట్లతో డిసెంబర్‌ 7, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వ్యక్తిగతంగా దరఖాస్తులను సమర్పించవచ్చు లేదా కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. సీనియారిటీ, ఐటీఐ/హెచ్‌ఎస్‌సీ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైపెండ్‌ చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అడ్రస్..

Dy.General Manager(HRD) ,
Training Institute ,
S&P Complex, NALCO, 759145.
Angul (District), Odisha.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.