MMRCL: ముంబయి మెట్రో రైల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరి తేదీ.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

MMRCL Recruitment: ముంబయి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను...

MMRCL: ముంబయి మెట్రో రైల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరి తేదీ.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
Mumbai Metro Jobs

Updated on: Aug 30, 2021 | 12:20 PM

MMRCL Recruitment: ముంబయి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ముంబై మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఎంఆర్‌సీఎల్‌) మహారాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి ప్రాజెక్ట్‌ అనే విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 19 ఖాళీలకు గాను డిప్యూటీ ఇంజనీర్‌ (07), జూనియర్‌ ఇంజనీర్‌ (12) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పీఎస్‌టీ, ఈ అండ్‌ ఎం విభాగాల్లో ఈ పోస్టులను తీసుకోనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. ఎలక్ట్రికల్‌/మెకానికల్‌ సబ్జెక్టుల్లో డిప్లొమా/ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.34,020 నుంచి రూ.64,310 చెల్లిస్తారు.

* అభ్యర్థులను అకడమిక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), ముంబై మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఎంఎంఆర్‌జీఎల్‌–లైన్‌3 ట్రాన్సిట్‌ ఆఫీస్, ఈ బ్లాక్, బంద్రా కుర్లా కాంప్లెక్స్, బంద్రా(ఈస్ట్‌), ముంబై–400051 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ రేపటితో (ఆగస్టు 31) ముగియనుంది.

* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Hot Balloon Guinness: 21 వేలకు పైగా అడుగుల ఎత్తులో, కళ్లకు గంతలు కట్టుకొని.. గిన్నిస్‌ రికార్డ్‌ కోసం ఎంత సాహసమో..

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీలో జాబ్‌ మేలా.. నాలుగు సంస్థల్లో 195 ఖాళీలు. పూర్తి వివరాలు..

TS EAMCET Counselling: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం.. ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.

Follow Us