MSME Baddi Recruitment 2022: భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్దిలోనున్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME Himachal Pradesh) టెక్నాలజీ సెంటర్.. ఒప్పంద ప్రాతిపదికన 14 మేనేజర్ మార్కెటింగ్, సీనియర్ ఇంజినీర్ (డిజైన్), ఇంజినీర్ (ప్రొడక్షన్) తదితర (Manager Marketing Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత మెకానికల్/ప్రొడక్షన్/మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ/ఆటోమొబైల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకాట్రానిక్స్ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు అక్టోబర్ 10, 2022వ తేదీ నాటికి 30 నుంచి 40 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు అక్టోబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధాకంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు..
అడ్రస్: The Deputy General Manager, MSME Technology Centre – Baddi, Village Bhatolikalan, Katha, Hadbast No. 214, District Solan – 173205 (Himachal Pradesh).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.