విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌.. డిగ్రీ పాసైతే చాలు! నెలకు రూ.10 వేల స్టైపెండ్‌

విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 స్టైపెండ్‌ అందజేస్తారు. ఇంటర్న్‌షిప్‌ వ్యవధి ఒకటి నుంచి మూడు నెలల వరకు ఉంటుంది. మొత్తం 30 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 27లోగా MEA అధికారిక పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌.. డిగ్రీ పాసైతే చాలు! నెలకు రూ.10 వేల స్టైపెండ్‌
Ministry of External Affairs MEA Internship

Updated on: Sep 22, 2026 | 8:49 AM

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) యువత కోసం ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. విదేశాంగ విధానంపై యువతలో అవగాహన పెంచడం, మంత్రిత్వ శాఖ కార్యకలాపాలపై ప్రత్యక్ష అనుభవాన్ని అందించడం, వివిధ ప్రాంతాలు, సామాజిక-ఆర్థిక నేపథ్యాలకు చెందిన విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 27లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. EA ఇంటర్న్‌షిప్‌ను ప్రతి సంవత్సరం రెండు విడతల్లో నిర్వహిస్తుంది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఒక విడత, అక్టోబర్‌ నుంచి మార్చి వరకు మరో విడత ఉంటుంది. ఒక్కో విడతలో గరిష్టంగా 30 మంది ఇంటర్న్‌లను ఎంపిక చేస్తారు. ఇంటర్న్‌షిప్‌ వ్యవధి కనీసం ఒక నెల నుంచి గరిష్టంగా మూడు నెలల వరకు ఉంటుంది.

నెలకు రూ.10 వేల స్టైపెండ్‌

ఎంపికైన ప్రతి ఇంటర్న్‌కు ప్రాథమిక ఖర్చుల కోసం నెలకు రూ.10,000 స్టైపెండ్‌ అందజేస్తారు. అలాగే, అర్హత ఉన్న అభ్యర్థులకు వారి నివాస రాష్ట్రం లేదా చదువుతున్న కళాశాల/విశ్వవిద్యాలయం ఉన్న రాష్ట్ర రాజధాని నుంచి దిల్లీకి ఒకసారి రానుపోను ఎకానమీ క్లాస్‌ విమాన ప్రయాణ ఖర్చును నిర్దేశిత గరిష్ట పరిమితి మేరకు మంత్రిత్వ శాఖ భరిస్తుంది. అయితే దిల్లీలో ఇంటర్న్‌షిప్‌ సమయంలో వసతి, భోజనం తదితర ఏర్పాట్లను అభ్యర్థులే చేసుకోవాలి.

విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన భారతీయ పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులు. అయితే ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యే సంవత్సరం డిసెంబర్‌ 31 నాటికి అభ్యర్థి వయస్సు 25 సంవత్సరాలకు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ ఇలా..

ఇంటర్న్‌షిప్‌ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదట దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన, ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 30 సీట్లలో ప్రతి విడతకు 14 రాష్ట్రాల నుంచి 26 మంది, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇద్దరిని ఎంపిక చేస్తారు. టీఏడీపీ (TADP) జిల్లాలు లేదా సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తారు. మొత్తం ఖాళీల్లో కనీసం 30 శాతం స్థానాలను మహిళలకు కేటాయిస్తారు. ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అకడమిక్‌ వెయిటేజీని లెక్కిస్తారు. పురుషులు, మహిళలకు విడివిడిగా రాష్ట్రాల వారీగా మెరిట్‌ జాబితాలను రూపొందిస్తారు. ప్రాథమిక పరిశీలనలో టీఏడీపీ జిల్లాల అభ్యర్థులకు, ఇంటర్వ్యూ దశలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఖాళీల సంఖ్యకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఆన్‌లైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ అనంతరం గరిష్టంగా 30 మందిని తుది ఇంటర్న్‌లుగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా చేరకపోతే, ఆయా రాష్ట్రాల మెరిట్‌ జాబితాలో తదుపరి స్థానంలో ఉన్న అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు.

ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌, దరఖాస్తు, పరిశీలన, ఎంపిక, విభాగాల కేటాయింపు, సమాచార మార్పిడి తదితర ప్రక్రియలన్నీ MEA అధికారిక ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుని లాగిన్‌ వివరాలు పొందాలి. సెప్టెంబర్ 27, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ సంబంధాలు, ప్రజా వ్యవహారాలు, ప్రభుత్వ విధానాలపై ఆసక్తి ఉన్న యువతకు ఈ ఇంటర్న్‌షిప్‌ ద్వారా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్‌ 27, 2026.
  • ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల ప్రకటన: అక్టోబర్‌ 7, 2026.
  • ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ: అక్టోబర్‌ 17, 2026.
  • తుది ఎంపికైన అభ్యర్థుల ప్రకటన: అక్టోబర్‌ 23, 2026.

విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us