AP Backlog Jobs 2022: 5వ/7వ/10వ తరగతి అర్హతతో.. కర్నూలు జిల్లాల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన కర్నూలు జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో.. జూనియర్ స్టెనో (ఇంగ్లిష్), టైపిస్ట్ తదితర బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి..

AP Backlog Jobs 2022: 5వ/7వ/10వ తరగతి అర్హతతో.. కర్నూలు జిల్లాల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌..
Andhra Pradesh

Updated on: Oct 28, 2022 | 8:08 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన కర్నూలు జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో.. జూనియర్ స్టెనో (ఇంగ్లిష్), టైపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ల్యాబ్ అటెండెంట్ తదితర బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఐదో తరగతి, ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంఎల్‌టీ, డిగ్రీ, హయ్యర్ గ్రేడ్ తెలుగు/ ఇంగ్లిష్ టైప్ రైటింగ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. ఆ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌లో నవంబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తులను నేరుగా సమర్పించవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 19వ తేదీన విడుదలైంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • జూనియర్ స్టెనో (ఇంగ్లిష్) పోస్టులు: 01
  • టైపిస్ట్ పోస్టులు: 2
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు: 1
  • ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 1
  • పీహెచ్‌ వర్కర్ పోస్టులు: 1
  • ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు: 1

అడ్రస్:

సహాయ సంచాలకులు
విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులు, హిజ్రా, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కలెక్టర్‌ కాంప్లెక్స్‌
కర్నూలు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us