Kendriya Vidyalaya: ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు.. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలకు నేడే చివరి తేదీ..

|

Mar 24, 2022 | 6:37 AM

Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ (Hyderabad), ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన వాన్‌ఇన్‌ ఇంటర్వ్యూలను..

Kendriya Vidyalaya: ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు.. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలకు నేడే చివరి తేదీ..
Kendriya Vidyalaya Jobs
Follow us on

Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ (Hyderabad), ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన వాన్‌ఇన్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలను రెండు రోజులు నిర్వహిస్తుండగా ఇప్పటికే మార్చి 23కు సంబంధించి ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. ఇక ఇంటర్వ్యూలు నేటితో (మార్చి 24) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ టీచింగ్ పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు.

* కామర్స్, మ్యాథమేటిక్స్, హిందీ, సోషల్‌ స్టడీస్, ఇంగ్లిష్, సంస్కృతం విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* నాన్‌ టీచింగ్ విభగానికి వస్తే కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్‌ కౌన్సిలర్,స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు ఉన్నాయి.

* రోప్‌ స్కిప్పింగ్, హాకీ, యోగా, డ్యాన్స్, కంప్యూటర్స్‌ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ముఖ్యమైన విషయాలు..

* అభ్యర్థులను నేరుగా వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు .

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో నేరుగా ఇంటవర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను కేంద్రీయ విద్యాలయం నెం.1, ఉప్పల్‌, హైదరాబాద్-39లో నిర్వహిస్తారు.

* మార్చి 23, 24 తేదీల్లో వాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు.. కానీ ఈ రహస్యాలు ఎవ్వరికీ చెప్పరు..

Radhe Shyam: షాకిచ్చిన ప్రభాస్ !! ఉన్నట్టుండి 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ !!

బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గన్‌ ఫైర్‌ !! సీన్‌ కట్‌ చేస్తే.. ఆ బుల్లెట్‌ కాస్త !!