బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకులు ఇవాళ వెలువడే ఛాన్స్ ఉంది. నాలుగో విడుత పర్సంటైల్‌తోపాటు తుది ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించనుంది. దీంతోపాటు కటాఫ్ మార్కులను కూడా విడుదల చేస్తుంది. విద్యార్థులు ర్యాంకుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇదిలావుంటే.. ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే JEE అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 11) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. JEE మెయిన్ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కావడంతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేశారు.
ఈ మేరకు ఈ పరీక్ష నిర్వహించనున్న JEE ఖరగ్‌పూర్( IIT Kharagpur) గత వారం ప్రకటన చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేసినట్టు ఐఐటీ ఖరగ్‌పూర్ తెలిపింది. ఈ నెల 13వ తేదీ(సోమవారం) మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 వ తేదీ సాయంత్రం 5 వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3న పరీక్ష యథాతథంగా జరగనుంది. అభ్యర్థుల హాల్‌టికెట్‌లు, పరీక్ష కేంద్రాలపై సమాచారం సెప్టెంబర్ 27 తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది. మెయిన్ క్వాలిఫై అయిన 2.5 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి వీలుంది.
ఇవి కూడా చదవండి: Chanakya Niti: వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఆచార్య చాణక్యుడు ఈ ఐదు టిప్స్ పాటిస్తే చాలు.. మీరు కోటీశ్వరులే… ఓ సారి ట్రై చేయండి..