Campus Placements: కరోనా కాలంలోనూ ప్రతిభకు పట్టం.. ఆ యూనివర్సిటీ విద్యార్థికి రూ.30 లక్షల ప్యాకేజీ..!

|

Apr 07, 2021 | 1:39 PM

ప్రతిభ కలిగినవారికి పదవులు వెతుకుంటూ వస్తాయని మరోసారి రుజువైంది. తాజాగా ఓ విద్యార్థి దాదాపు రూ. 30 లక్షలతో ఉద్యోగాన్ని కొట్టేశాడు.

Campus Placements: కరోనా కాలంలోనూ ప్రతిభకు పట్టం.. ఆ యూనివర్సిటీ విద్యార్థికి రూ.30 లక్షల ప్యాకేజీ..!
Campus Placements
Follow us on

highest salary package: ప్రతిభ కలిగినవారికి పదవులు వెతుకుంటూ వస్తాయని మరోసారి రుజువైంది. తాజాగా ఓ విద్యార్థి దాదాపు రూ. 30 లక్షలతో ఉద్యోగాన్ని కొట్టేశాడు. ఈ కరోనా కాలంలోనూ ఆ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటారు. ఏకంగా రూ.29.92 లక్షల ప్యాకేజీ సాధించి సత్తా చాటారు.

హర్యానా రాష్ట్రంలోని ఫరియాబాద్ లోని జేసీ బోస్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వైఎంసీఏ క్యాంపస్‌లో 2020 21 విద్యా సంవత్సరానికి గానూ నియామకాల ప్రక్రియ కొనసాగించాయి. ఇందు కోసం ఏకంగా 225 కంపెనీలు జాబ్ మేళాకు హాజరై తమకు కావల్సిన అర్హతలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అత్యధికంగా రూ.29.92 లక్షల ప్యాకేజీని ఆయా కంపెనీలు ఆఫర్ చేశాయి.

ఈ ప్లేస్ మెంట్లలో యూనివర్సిటీకి చెందిన 11 మంది విద్యార్థులు ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సాంసంగ్ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో ఆరుగురు విద్యార్థులు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ సంస్థ లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో నలుగురు ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ కంపెనీలో ఉద్యోగాలకు, మరో ఇద్దరు అడోఫ్ సిస్టమ్, బీఎన్‌వై మిలన్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. Media.net, స్వ్కాడ్ స్టేక్ తదితర కంపెనీల్లో ఒక్కొక్కరు చొప్పున ఉద్యోగాలకు సాధించారు. వీరిలో అత్యధికంగా మీడియా.నెట్ సంస్థ రూ.29.92 లక్షల సాలరీని విద్యార్థులకు ఆఫర్ చేయడం విశేషం.

ఈ ప్లేస్మెంట్ల రికార్డు గురించి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫేసర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కరోనా సమయంలోనూ తమ విద్యార్థులు అంతర్జాతీయంగా ప్రతిభ చాటారని కొనియాడారు. గొప్ప ప్లేస్‌మెంట్ రికార్డును సాధించి సత్తా చాటారని అభినందించారు. అనేక టాప్ కంపెనీలు తమ యూనివర్సిటీపై నమ్మకం ఉంచి ఫైనల్ సెమిస్టర్ కన్నా ముందే తమ విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశాయన్నారు. తమ యూనివర్సిటీక చెందిన అనేక మంది విద్యార్థులు అనేక ప్రతిష్టాత్మకమైన కంపెనీల్లో పి చేస్తున్నారన్నారు.

యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ డా. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ 2021లో కోర్సు పూర్తి చేసుకోబోయే విద్యార్థుల్లో 410 మంది ఇప్పటికే ఉద్యోగాలు సాధించారని చెప్పారు. 2019 20 విద్యాసంవత్సరానికి చెందిన వారిలో 402 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. 2019 20లో విద్యార్థులు సాధించిన సరాసరి ప్యాకేజీ రూ. 3.78 లక్షలు అని వెల్లడించారు. ఇప్పుడు ఆ యావరేజ్ ప్యాకేజీ రూ. 4 లక్షలకు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు.

Read Also…  Manjula Vaghela’s Success Story: ఒకప్పుడు ఐదు రూపాయల కోసం చెత్త ఏరుకున్న మహిళ.. నేడు కోట్ల రూపాయల టర్నోవర్‌తో బిజినెస్