ITI Limited Recruitment 2021: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. బెంగళూరులో ఉన్న ఈ సంస్థకు చెందిన ఆసుపత్రుల్లో స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ రేపటితో (జున్ 22) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* స్టాఫ్ నర్సు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఎక్స్‌రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ ఫార్మసిస్ట్, రిసెప్షనిస్ట్, హెల్పర్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. పోస్టుల ఆధారంగా ఏడో తరగతి, పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లలో డిప్లొమా, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 28, 30 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు.. మొదట ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం హార్డ్ కాపీలను ఆఫ్‌లైన్ విధానంలో సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
* హార్డ్ కాపీలను ఏజీఎం–హెచ్‌ఆర్, ఐటీఐ లిమిటెడ్, బెంగళూరు ప్లాంట్, దూరవాణి నగర్, బెంగళూరు 560016 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను అప్టిట్యూడ్/టెక్నికల్ టెస్ట్/గ్రూప్ టాస్క్ ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు 22-07-2021 చివరి తేదీ కాగా, హార్డ్ కాపీలను 24-07-2021లోగా పంపించాలి.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..