ITBP Head Constable Jobs 2022: ఇంటర్‌ అర్హతతో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో హెడ్​కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రూ.81100ల జీతం..

|

Oct 20, 2022 | 7:07 AM

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌.. 40 హెడ్​కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

ITBP Head Constable Jobs 2022: ఇంటర్‌ అర్హతతో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో హెడ్​కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రూ.81100ల జీతం..
ITBP Head Constable Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌.. 40 హెడ్​కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో పురుషులకు 34, మహిళలకు 6 పోస్టులున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు పారా వెటర్నరీ కోర్సు లేదా డిప్లొమా లేదా వెటర్నరీ థెరప్యూటిక్/ లైవ్‌స్టాక్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు నవంబర్‌ 17, 2022వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 17, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 19, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫకేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.