IREL Recruitment 2021: ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తమిళనాడులో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 21 ఖాళీలకు గాను ట్రేడ్ అప్రెంటిస్ (20), టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్)– (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు గాను ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, వెల్డర్, టర్నర్, ప్లంబర్, కార్పెంటర్, ల్యాబ్ అసిస్టెంట్(కెమికల్) పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అదే విధంగా ల్యాబ్ అసిస్టెంట్(కెమికల్) పోస్టులకు బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.
* టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేసి అనంతరం దాంతో పాటు సంబంధిత డ్యాక్యుమెంట్లను జత చేసి ఆఫ్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
* దరఖాస్తును ది మేనేజర్ (పర్సనల్), ఐఆర్ఈఎల్ (ఇండియా) లిమిటెడ్, మనవాలకురిచి, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు– 629252 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 31.08.2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Surekha Sikri Dies : ‘చిన్నారి పెళ్లి కూతురి’ బామ్మగారు సురేఖా సిక్రీ ఇక లేరు.. గుండెపోటుతో మృతి
Medchal: మా గొప్ప డాక్టర్.. విరిగింది ఒక కాలు అయితే మరో కాలుకు సర్జరీ..