IOB Recruitment: ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు చెందిన స్నేహ ట్రస్ట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో భాగంగా స్నేహ ట్రస్ట్‌లో టీచింగ్, నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులను..

IOB Recruitment: ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Iob Jobs

Updated on: Oct 27, 2022 | 7:21 PM

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు చెందిన స్నేహ ట్రస్ట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో భాగంగా స్నేహ ట్రస్ట్‌లో టీచింగ్, నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులను తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో బాగంగా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఫ్యాకల్టీ (07), ఆఫీస్ అసిస్టెంట్ (08), అటెండర్ (09) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు రూ. 200 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

* అభ్యర్థులను పోస్టుల ఆధారంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 15-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us