India Post Car Driver: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు.. చివ‌రి తేదీ.

|

Jun 24, 2021 | 9:45 PM

India Post Staff Car Driver: ఇండియా పోస్ట్ స్టాఫ్ డ్రైవ‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా స్టాఫ్ కార్ డ్రైవ‌ర్ (ఆర్డీన‌రీ గ్రేడ్‌) పోస్టుల్ని భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 25 ఖాళీల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు...

India Post Car Driver: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు.. చివ‌రి తేదీ.
India Post Driver Recruitment
Follow us on

India Post Staff Car Driver: ఇండియా పోస్ట్ స్టాఫ్ డ్రైవ‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా స్టాఫ్ కార్ డ్రైవ‌ర్ (ఆర్డీన‌రీ గ్రేడ్‌) పోస్టుల్ని భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 25 ఖాళీల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. నిజానికి ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీ 2021 మే 26న ముగియాల్సి ఉంది. కానీ అభ్య‌ర్థుల కోసం మ‌రో అవకాశం ఇచ్చారు. దీంతో గ‌డువును పెంచారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (25-06-2021)తో ముగియ‌నున్న నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు…

* డ్రైవ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్య‌ర్థుల‌కు మూడేళ్ల లైట్‌, హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
* అభ్యర్థుల వయస్సు 2021 మే 26 నాటికి 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త, ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు స్పీడ్ పోస్టు ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి ద‌ర‌ఖాస్తు ఫీజు లేదు.
* అభ్య‌ర్థులు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోని ద‌ర‌ఖాస్తును నింపాల్సి ఉంటుంది.
* అనంత‌రం ఆ ద‌ర‌ఖాస్తు ఫామ్‌తో పాటు.. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి ది సీనియ‌ర్ మేనేజ‌ర్‌, మెయిల్ మోట్ స‌ర్వీస్‌, చెన్నై అడ్ర‌స్‌కు పంపించాల్సి ఉంటుంది.
* నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌లో Recruitment సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.

Also Read: Viral Video: గుడ్డుతో కోడి సయ్యాటలు..సినిమా రేంజి స్టంట్లు..వైరల్ గా మారిన వీడియో..విషయం తెలిస్తే నవ్వుకుంటారు!

బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి మూకుమ్మడి వలసలు, ‘శానిటైజర్ తో శుద్ధి చేసుకుని మరీ’ !

ఏనుగుల మంద వెలి వేసిందని… ఊరిమీద పడిన గజరాజు… రెండు నెలల్లో 16 మందిని…