AP and TG Postal GDS 2026 Results: ఏపీ, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా విడుదల.. పూర్తి మెరిట్‌ లిస్ట్ ఇదే

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోబ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 28,636 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల మెరిట్ లిస్ట్ అధికారులు విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే

AP and TG Postal GDS 2026 Results: ఏపీ, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా విడుదల.. పూర్తి మెరిట్‌ లిస్ట్ ఇదే
AP and Telangana India Post GDS Results

Updated on: Mar 08, 2026 | 6:46 AM

హైదరాబాద్‌, మార్చి 8: కేంద్ర తపాలా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోబ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 28,636 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల మెరిట్ లిస్ట్ అధికారులు విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులు, తెలంగాణలో 608 చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన మొదటి మెరిట్‌ టిస్ట్‌లో ఏపీ నుంచి 1048 మంది, తెలంగాణ నుంచి 607 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా కంప్యూటర్ జనరేటెడ్‌ పద్ధతిలో ఈ జాబితాను ఎంపిక చేశారు. షార్ట్‌లిస్ట్‌ అయిన వీరందరికీ మార్చి 23వ తేదీలోగా డివిజన్‌ కార్యాలయాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. ఇందులో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా ఉంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌ పోస్టులను కేటాయిస్తారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తీసుకెళ్లవల్సిన పత్రాలు ఇవే..

  • ఇండియా పోస్టు జీడీఎస్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రింట్‌ కాపీలు
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో
  • ఒరిజినల్‌ స్టడీ సర్టిఫికెట్లు
  • 2 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్‌ కార్డు, ఆదాయ ధ్రువీకరణపత్రం
  • దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
  • మెడికల్‌ సర్టిఫికెట్‌

ఏపీ, తెలంగాణ పోస్టల్‌ జీడీఎస్‌ ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us