India Post Jobs 2026: పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో 28,740 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

పోస్టల్‌ సర్కిళ్లలో భారీగా గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియా పోస్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి పాసైన అభ్యర్దులు ఎవరైనా ఈ పోస్టులకు..

India Post Jobs 2026: పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో 28,740 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
Postal GDS-January 2026 Recruitment

Updated on: Feb 01, 2026 | 5:07 PM

దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టల్‌ సర్కిళ్లలో భారీగా గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియా పోస్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి పాసైన అభ్యర్దులు ఎవరైనా ఈ పోస్టులకు దర ఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులను తమ సొంత ఊరిలోని తపాలా శాఖలోనే పొందవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 14, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే పదో తరగతి సబ్జెక్టుల్లో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందినవారైతే తప్పనిసరిగా తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదివి ఉండాలి. దీనితోపాటు కంప్యూటర్ స్కిల్స్‌ ఉండాలి. అలాగే సైకిల్‌ లేదా బైక్‌ నడపడం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 14 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్థులు రూ.100 తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఎలాంటి ఫీజు లేదు. ఫీజు చెల్లింపులు ఫిబ్రవరి 16వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.

ఇక నింపిన దరఖాస్తుల్లో ఏవైనా పొరబాట్లు ఉంటే సవరణలకు ఫిబ్రవరి 18, 19 తేదీల్లో అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380, ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా మాత్రమే తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తపాలా పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.