Indbank Recruitment 2021: చెన్నైలోని ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 27 ఖాళీలను భర్తీచేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
* మొత్తం 27 ఖాళీలకుగాను హెడ్ – డిపీ డిపార్ట్‌మెంట్ (01), హెడ్ – అకౌంట్ ఓపెనింగ్ డిపార్ట్‌మెంట్ (01), డీపీ స్టాఫ్ (03), బ్రాంచ్ హెడ్ – రిటైల్ లోన్ కౌన్సెలర్ (05), ఫీల్డ్ స్టాఫ్ – రిటైల్ లోన్ కౌన్సెలర్ (17) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌ఐఎస్‌ఎం డీపీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* హెడ్ – డీపీ డిపార్ట్‌మెంట్ పోస్టుకు ఎంపికైన వారికి వార్షికంగా రూ. 6 నుంచి 8.50 లక్షలవ వరకు అందిస్తారు.
* హెడ్ – అకౌంట్ ఓపెనింగ్ డిపార్ట్‌మెంట్ పోస్టుకు ఎంపికైన వారికి వార్షికంగా రూ. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఇస్తారు.
* డీపీ స్టాఫ్ ఉద్యోగులు ఏడాదికి రూ. 3 లక్షల నుంచి 4 లక్షల వరకు పొందుతారు.
* ఫీల్డ్ స్టాఫ్ – రిటైల్ లోన్ కౌన్సెలర్ పోస్టుకు ఎంపికై వారికి వార్షికంగా రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు అందిస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఇండ్ బ్యాంక్, 480, ఫస్ట్ ఫ్లోర్, ఖివ్‌రాజ్ కాంప్లెక్స్ 1, అన్నసలై, నందనం, చెన్నై, 600035 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 14-08-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
TSRJC CET 2021 Exam Date: ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ సెట్ ప్రవేశ పరీక్ష..
AP Inter Results: ఇంటర్మీడియట్ ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నారా?.. అయితే అందుకు సిద్ధమవండి..