భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబాయిలోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ.. ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్ ‘సి’, మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా నర్సింగ్, మిడ్వైఫరీ/ఎంబీబీఎస్/బీఏఎంఎస్/బీహెచ్ఎంఎస్/సోషియాలజీలో ఎంఏ/ఎంఎస్డబ్ల్యూ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 34 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా అక్టోబర్ 6, 2022వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
జీతభత్యాల వివరాలు..
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.