ICAR – CICR Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రీసెర్చ్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఖాళీలు..

|

Apr 16, 2022 | 7:31 PM

కోయంబత్తూరులోని ఐకార్‌ - సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రీసెర్చ్‌ (CICR).. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (SRF Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

ICAR - CICR Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రీసెర్చ్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఖాళీలు..
Cicr
Follow us on

ICAR – CICR project staff Recruitment 2022: కోయంబత్తూరులోని ఐకార్‌ – సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రీసెర్చ్‌ (CICR).. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (SRF Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు:

  • సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు: 1
  • జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు: 1
  • యంగ్‌ ప్రొఫెనల్స్‌ పోస్టులు: 7

పే స్కేల్: నెలకు రూ.25,000ల నుంచి రూ.35,000లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐకార్‌/సీఎస్ఐఆర్‌/యూజీసీ నెట్‌లో అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: ICAR-Central Institute for Cotton Research (ICAR), Regional Station, Maruthamalai Road, Coimbatore – 641 003, Tamil Nadu.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 20, 21, 22 తేదీల్లో జరుగుతుంది, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

DTC Recruitment 2022: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో 357 అసిస్టెంట్‌ పోస్టులు..నెలకు రూ.35,400ల వరకు జీతం..