TS Police Recruitment 2022: హైదరాబాద్‌లో పది కేంద్రాల్లో ప్రారంభమైన పోలీస్‌ ఉచిత శిక్షణ

|

Apr 26, 2022 | 3:50 PM

పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఎస్సై ఉద్యోగాల కోసం అభ్యర్థులకు హైదరాబాద్‌ పోలీసులు శిక్షణ ప్రారంభమైంది.. పది కేంద్రాల్లో ఇప్పటికే..

TS Police Recruitment 2022: హైదరాబాద్‌లో పది కేంద్రాల్లో ప్రారంభమైన పోలీస్‌ ఉచిత శిక్షణ
Free Police Training Progra
Follow us on

free training program for telangana police job aspirants: తెలంగాణ పోలీసుశాఖతో పాటు ఎస్పీఎఫ్‌, అగ్నిమాపక, జైళ్లశాఖలో 16,614 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఏప్రిల్ 25న‌ నాలుగు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి 20 వరకు కొనసాగనుంది. యూనిఫాం పోస్టులకు (upper age limit for uniform posts) 3 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే సన్నద్ధత మొదలుపెట్టిన యువత తాజా ప్రకటన నేపథ్యంలో దాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన 80 వేల ఉద్యోగాల్లో మొదటి ప్రకటన పోలీసుశాఖ (TS Police Job Notification 2022) నుంచే రావడం విశేషం.

ప్రారంభమైన పోలీస్‌ శిక్షణ కేంద్రం..
పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఎస్సై ఉద్యోగాల కోసం అభ్యర్థులకు హైదరాబాద్‌ పోలీసులు శిక్షణ ప్రారంభించారు. శారీరకంగా, మానసికంగా సిద్ధమైన వారిలో 14వేల మందిని స్క్రీనింగ్‌ పరీక్షల ద్వారా ఎంపిక చేశారు. వీరికి పదికేంద్రాల్లో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు వసతి కల్పించనున్నారు. జోనల్‌ డీసీపీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పోలీస్‌ అధికారులు ఇప్పటి వరకూ 2500 మందికి పైగా యువత కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యేలా చేశారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఖాళీగా ఉన్న 3 వేల పోస్టుల కోసం శిక్షణ ఇచ్చేందుకు సీపీ ఆనంద్‌ నిర్ణయించారు.

అందుకే వారిని ఎంపిక చేశారు..
కానిస్టేబుళ్లు, ఎస్సైలుగా ఎంపికయ్యేవారికి వారుంటున్న ప్రాంతాల్లో సమస్యలపై అవగాహన ఉంటుంది. అందుకే పాతబస్తీ, పశ్చిమమండలంలో ఉంటున్న అర్హులైన యువతను పోలీస్‌ అధికారులు ఎంపిక చేశారు. పాతబస్తీ, మాంగార్‌బస్తీల్లో చదువుకున్న యువత పోలీసు ఉద్యోగాల్లో చేరగానే ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల శాంతిభద్రతల సమస్యలు తగ్గాయి. అందుకే ప్రస్తుతం శిక్షణకు ఎంపికైన వారికి కీలక దశల్లో ప్రోత్సాహమివ్వాలని నిర్ణయించారు.

చదువు నుంచి వ్యాయామం వరకు
హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 63 ఠాణాల పరిధుల్లో ప్రతి ఠాణా నుంచి కనీసం 100-200 మంది వరకు తీసుకున్నారు. వీరందరికీ సమీపంలోని మైదానాలు, స్టేడియాల్లో ఎత్తు, శారీరక ప్రమాణాలు, చదువును పరిగణనలోకి తీసుకుని వ్యాయామం.. చదువులో ఉత్తమ శిక్షణ.. సమతుల ఆహారాన్ని అందించనున్నారు.

Also Read:

TS Govt Jobs 2022: తెలంగాణ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో పెట్టనున్న ఒరిజినల్‌ ఓఎంఆర్‌ పత్రాలు!