Hyderabad Metro Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రోలో ఖాళీలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే..

|

Feb 24, 2023 | 6:37 PM

ప్రయాణికులకు సేవలందిస్తూ ఆదరణ చూరగొంటున్న హైదరాబాద్ మెట్రో.. నిరుద్యోగులకూ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ మెట్రో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పోస్టుల సంఖ్య, అర్హతలతో..

Hyderabad Metro Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రోలో ఖాళీలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే..
Hyderabad Metro Train
Follow us on

ప్రయాణికులకు సేవలందిస్తూ ఆదరణ చూరగొంటున్న హైదరాబాద్ మెట్రో.. నిరుద్యోగులకూ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ మెట్రో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పోస్టుల సంఖ్య, అర్హతలతో పాటు పలు వివరాలను వెల్లడించింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టుల వివరాలు, అర్హతలు, ఉద్యోగాల దరఖాస్తు తేదీలతో పాటు ఇతర వివరాలను వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో వివరాలను పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. నిరుద్యోగులు ఆసక్తి, అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా https://www.ltmetro.com/ వెబ్​సైట్​ ఓపెన్​ చేసి హోమ్ పేజీలో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేసి, కరెంట్ ఆపర్చ్యునిటీస్ పై పైన క్లిక్ చేయాలి. మీ అర్హతలు, వివరాలు నమోదు చేసి KeolisHyd.Jobs@keolishyderabad.com మెయిల్ ఐడీకి పంపించాలి. ఏఎంఎస్ ఆఫీసర్- 1, సిగ్నలింగ్ టీమ్- 2, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్- 6, ట్రాక్స్ టీమ్ లీడర్- 2, ఐటీ ఆఫీసర్- 1 పోస్టులున్నాయి.

ఏఎంఎస్ ఆఫీసర్ పోస్టుకు ఇంజనీరింగ్, అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. సిగ్నలింగ్ టీమ్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ పోస్టుకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. ట్రాక్స్ టీమ్ లీడర్ పోస్టుకు సివిల్, మెకానికల్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉండాలి. ఐటీ ఆఫీసర్ పోస్టుకు బీటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సీ, 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..