భారత ప్రభుత్వ రంగానికి చెందిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్.. ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ జనరల్ మేనేజర్ / డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, రీజినల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫైనాన్స్, క్లినికల్ రీసెర్చ్, ఎనలిటికల్, సెల్ కల్చర్, మైక్రోబయాలజీ, నేచురల్ ప్రొడక్ట్స్ – కెమిస్ట్రీ, యానిమల్ హౌస్, సింథటిక్ ప్రొడక్ట్స్, లైబ్రరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 2, 2022వ తేదీలోపు కింది ఈమెయిల్ ఐడీకి దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ ఐడీ: recruiter@lifecarehll.com
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.