Job Recruitment: కొత్త ఏడాదిలో కొలువుల జాతర.. భారీగా ఉద్యోగుల నియామకాలు..!

|

Dec 15, 2021 | 9:12 PM

Job Recruitment: నిరుద్యోగులకు శుభవార్త వెలువడనుంది. కొత్త ఏడాదిలో కొలువుల జాతర మొదలు కానుంది. వచ్చే ఏడాది జనవరి- మార్చి నెలలో కార్పొరేట్‌ సంస్థలు..

Job Recruitment: కొత్త ఏడాదిలో కొలువుల జాతర.. భారీగా ఉద్యోగుల నియామకాలు..!
Follow us on

Job Recruitment: నిరుద్యోగులకు శుభవార్త వెలువడనుంది. కొత్త ఏడాదిలో కొలువుల జాతర మొదలు కానుంది. వచ్చే ఏడాది జనవరి- మార్చి నెలలో కార్పొరేట్‌ సంస్థలు భారీగా ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మ్యాన్‌ పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలో హైరింగ్‌ సెంటిమెంట్‌ గడిచిన ఎనిమిది సంతవ్సరాలలో ఎన్నడు లేని విధంగా బలంగా ఉందని సర్వే ద్వారా తేల్చింది. 49 శాతం కంపెనీలు మరింత మందిని ఉద్యోగాల్లోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఏడాది కిందటితో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ క్రమ క్రమంగా కోలుకుంటున్నద ఆశాభావం కార్పొరేట్‌ వర్గాల్లో పెరిగినట్లు సర్వే చెబుతోంది.

సర్వేలో మొత్తం 3,020 కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో 64 శాతం కంపెనీలు తమ సిబ్బందిని రాబోయే మూడు నెలల్లో పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పగా, 15 శాతం కంపెనీలు ఉద్యోగులు తగ్గుతారని చెప్పాయి. మరో 20 శాతం సంస్థలు తమ ఉద్యోగులు యథావిధంగా ఉంటాయని తెలిపాయి. దీంతో నికర ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ 49 శాతంగా తేలింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా కంపెనీలు ఉద్యోగుల నియామకాలపై దృష్టి పెడుతున్నాయని తేలింది. వచ్చే సంవత్సరం జనవరి-మార్చి నెలలో ఉద్యోగ నియామకాలు చేపడతామని 51 శాతం భారీ సంస్థలు చెబుతున్నాయి. ఇక చిన్నతరహా కంపెనీల్లో ఇది 25 శాతంగా ఉన్నట్లు సర్వే చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

Telangana: తెలంగాణ అగ్రికల్చర్‌, వెటర్నరీ పోస్టుల భర్తీకి మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

JNVST 2022: నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు నేడే ఆఖరు తేది.. అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి..