HSL Recruitment 2021: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

|

Jun 25, 2021 | 7:06 PM

HSL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. విశాఖ‌ప‌ట్నంలోని ఈ సంస్థ‌లో మొత్తం 53 పోస్టుల‌ను...

HSL Recruitment 2021: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Hindusthan Ship Yard
Follow us on

HSL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. విశాఖ‌ప‌ట్నంలోని ఈ సంస్థ‌లో మొత్తం 53 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* ఇందులో భాగంగా ప‌ర్మ‌నెంట్ అబ్జార్‌ప్ష‌న్ ప్రాతిపాదికన 18 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిలో హెచ్ఆర్‌, టెక్నిక‌ల్, ఫైనాన్స్ విభాగాల్లో జనరల్‌ మేనేజర్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్ పోస‌ట్లు భ‌ర్తీ చేయ‌నున్నారు.
* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఫుల్‌ టైం గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో 31 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆగుమెంటేషన్, ఎస్‌ఏపీ ఏబీఏపీ డెవలపర్‌, సబ్‌మెరైన్‌ టెక్నికల్ విభాగాల్లో డిప్యూటీ చీఫ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం ఇంజినీరింగ్‌ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ(బీఈ/ బీటెక్‌)/ ఎంటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ఒప్పంద ప్రాతిపదిక‌న మొత్తం 04 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా… టెక్నికల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆగుమెంటేషన్, ఈకేఎం ప్లానింగ్‌ అండ్‌ సబ్‌మెరైన మేనేజ్‌మెంట్ విభాగాల్లో సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్య‌ర్థుల‌ను గ్రూప్‌ డిస్కషన్/ ఇంటర్వ్యూ (ఆన్‌లైన్‌) ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హ‌త‌, ఆస‌క్తిఉ న్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: CBSE, JEE, NEET: జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు, సీబీఎస్ఈ ఫ‌లితాలు.. విద్యార్థుల‌తో కేంద్ర‌మంత్రి పంచుకున్న విష‌యాలు..

Job Opportunity: మీకు ఉద్యోగం కావాలా..? వీడియోలు చూస్తూ కూర్చోవడమే మీ పని.. నెలకు రూ.30 వేల వేతనం..!

MCTE Recruitment: మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ టెలీక‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అప్లై చేసుకోవ‌చ్చంటే..