HAL Recruitment: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ క్యాంపస్‌లో పలు విభాగాల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్...

HAL Recruitment: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Hal Jobs

Updated on: Sep 05, 2022 | 6:40 AM

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ క్యాంపస్‌లో పలు విభాగాల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 82 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (26), టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ (34), జనరల్ స్ర్టీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (22) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, డిప్లొమా, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో సంబంధిత సర్టిఫికేట్లతో రావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను సెప్టెంబర్ 12, 13, 14 తేదీలలో నిర్వహించనున్నారు.

* ఆడిటోరీయం, డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్ మెంట్ బ్యాక్ సైడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ అడ్రస్‌లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us