Hindi Jobs: విదేశాలలో ఉద్యోగాలు కోరుకునే హిందీ మాట్లాడేవారికి ఫ్రాన్స్ అత్యధిక జీతాలను అందిస్తున్నట్లు లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ ప్రిప్లై పరిశోధనలో తేలింది. దీని నివేదిక ప్రకారం ఫ్రాన్స్ సంవత్సరానికి యావరేజ్ గా లక్ష డాలర్లు ఆఫర్ చేస్తోంది. దీని తరువాత స్థానంలో ఆస్ట్రేలియా(Australia) 50 వేల డాలర్లు అందిస్తోంది. ఇందుకోసం.. లండన్(London) ఆధారిత జాబ్ సెర్చ్ ఇంజన్ అడ్జునాలో పోస్ట్ చేసిన 16 వేర్వేరు దేశాలలోని 100 కంటే ఎక్కువ నగరాల నుంచి 1.5 మిలియన్ ఉద్యోగ ప్రకటనల డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ప్రస్తుతం అడ్జునా 20 కంటే ఎక్కువ దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది.
వారు జాబ్ టైటిల్ లో లేదా డిస్కెప్షన్లో “జర్మన్,” “ఫ్రెంచ్,” “హిందీ” వంటి భాషలకు సంబందించిన కీవర్డ్స్ ను సెర్చ్ చేశారు. అలా సదరు ఉద్యోగాలకు ఆఫర్ చేస్తున్న కంపెనీలు ఎంత జీతం చెల్లించేందుకు ఆసక్తిగా ఉన్నాయో పోల్చిచూశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడుతున్న మూడో భాషగా హింది ఉంది. ఈ భాషను ప్రపంచంలో సుమారు 600 మిలియన్ మంది మాట్లాడుతున్నట్లు ఫోబ్స్ ఇండియా నివేదికలో తేలింది.
ఇవీ చదవండి..
EV Showroom Fire: మంటల్లో ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ కాలిబూడిద.. తమిళనాడులో చోటుచేసుకున్న ప్రమాదం..
Buying House: సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఇది సరైన సమయమేనా..? పూర్తి వివరాలు..