BHEL Recruitment: బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

|

Oct 03, 2022 | 1:02 PM

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజనీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (04-10-2022)తో ముగియనున్న నేపథ్యంలో..

BHEL Recruitment: బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Bhel Jobs
Follow us on

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజనీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (04-10-2022)తో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 150 ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు ఉన్నాయి.

* సివిల్‌, మెకానికల్‌, ఐటీ/ కంప్యూటర్స్‌, ఎలక్ట్రికల్స్‌, కెమికల్‌, మెటలార్జీ, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, మెకాట్రానిక్స్, పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, థర్మల్ ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ/ డ్యుయల్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 27 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.

* ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సీఏ/ పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల యసు 29 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 50,000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు రేటితో (04-10-2022) ముగియనుంది.

* ఆన్‌లైన్‌ పరీక్షను 31-10-2022, 01-11-2022, 02-11-2022 తేదీల్లో నిర్వహించనున్నారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..