ECIL Junior Technician Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రదాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)..ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల (Junior Technician posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 1625
పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
ట్రేడుల వారీగా ఖాళీలు:
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 814
ఎలక్ట్రీషియన్: 184
ఫిట్టర్: 627
అర్హతలు: మెకానిక్/ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: మొదటి ఏడాది నెలకు రూ.20,480, రెండో ఏడాది నెలకు రూ.22,528, మూడో ఏడాది నెలకు రూ.24,780లు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: