Job Alert: బీటెక్‌/ఎంటెక్‌/ఐటీఐ అర్హతతో 150 అప్రెంటీస్‌ ఉద్యోగాలు.. త్వరలో ముగియనున్న గడువు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Job Alert: బీటెక్‌/ఎంటెక్‌/ఐటీఐ అర్హతతో 150 అప్రెంటీస్‌ ఉద్యోగాలు.. త్వరలో ముగియనున్న గడువు
ITI Jobs

Updated on: Feb 02, 2022 | 3:29 PM

DRDO Recruitment 2022: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 150

ఖాళీల వివరాలు:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 40 పోస్టులు
  • టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్: 60 పోస్టులు
  • ట్రేడ్ అప్రెంటీస్: 50 పోస్టులు

అర్హతలు: అభ్యర్ధులు ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి.

  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు ఈసీఈ (ECE), ఈఈఈ (EEE), సీఎస్‌ఈ (CSE), మెకానికల్, కెమికల్ విభాగాల్లో బీఈ/ బీటెక్‌, బీకాం, బీఎస్సీ ఏదైనా డిగ్రీలో అర్హత ఉండాలి.
  • టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులకు ఈసీఈ (ECE), ఈఈఈ (EEE), సీఎస్‌ఈ (CSE), మెకానికల్‌, కెమికల్ విభాగాల్లో డిప్లొమా ఉండాలి.
  • ట్రేడ్ అప్రెంటీస్: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్ విభాగాల్లో ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.31,000 నుంచి 63,000ల వరకు చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIT – Delhi Jobs: బీటెక్‌/ఎంటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నెలకు రూ.63,000ల జీతంతో ఐఐటీ ఢిల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!