హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దూరవిద్యా విధానంలో పలు యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 22 అధ్యయన కేంద్రాల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు..
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దూరవిద్యా విధానంలో పలు యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 22 అధ్యయన కేంద్రాల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 29, 2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. యూజీ ప్రోగ్రామ్‌లకు మూడేళ్లు, పీజీ ప్రోగ్రామ్‌లకు రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/ బీఎల్‌ఐఎస్సీ/ డిప్లొమా/ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు ఏడాది వ్యవధిలో పూర్తి చేయవల్సి ఉంటుంది. ఇక సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు అయితే ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలి. సంబంధిత కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఫుడ్ అండ్ న్యూట్రిషన్/ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్/ ఎన్‌జీవోస్ మేనేజ్‌మెంట్/ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు అందిస్తోంది.
ముఖ్య తేదీల వివరాలు
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఫిబ్రవరి 29, 2024.
రూ.200 అపరాధ రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2024.