DMHO Nalgonda District MLHP Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో.. 96 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్/బీఏఎంఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అలాగే 2020 తర్వాత బీఎస్సీ నర్సింగ్/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణత సాధించి, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం పూర్తిచేసిన వారు కూడా అర్హులే. వయసు ఖచ్చితంగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. తుది ఎంపిక ఫలితాలు అక్టోబర్ 3, 2022వ తేదీన ప్రకటిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం, నల్గొండ, తెలంగాణ.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.