DMHO Guntur Recruitment 2022: గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకు రూ.లక్షకు పైగా జీతంతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

|

Jul 28, 2022 | 4:18 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్‌లో (DMHO Guntur District).. ఒప్పంద ప్రాతిపదికన 14 జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌..

DMHO Guntur Recruitment 2022: గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకు రూ.లక్షకు పైగా జీతంతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
Andhra Pradesh
Follow us on

DMHO Guntur General Physician Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్‌లో (DMHO Guntur District).. ఒప్పంద ప్రాతిపదికన 14 జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌, సైకియాట్రిస్ట్‌, మెడికల్ ఆఫీసర్, సైకాలజిస్ట్, ఆడియోమెట్రీషియన్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, ఎంబీబీఎస్‌, ఎండీ, డిప్లొమా, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జులై 1, 2022 నాటికి దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 3, 2022న నిర్వహించే ఇంటర్వ్యూకు సంబంధిత డాక్యుమెంట్లతో హాజరుకావచ్చు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.21,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్: DMHO Guntur, District Programme Management Unit (DPMU), National Health Mission, Guntur.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.