DMHO East Godavari Para Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO East Godavari) పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 459 మెడికల్ స్టాఫ్ పోస్టుల (Para Medical Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి/ఐటీఐ/ఇంటర్మీడియట్/యూజీ/పీజీ/డిప్లొమా/డీఫార్మసీ/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పోస్టును బట్టి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 20, 2022లోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టులో దరఖాస్తులు పంపవచ్చు. దరఖాస్తు రుసుము రూ.250లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్షలేకుండా నేరుగా విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుంది. అర్హత సాధించినవారికి నెలకు రూ.15,000ల నుంచి రూ.61,960ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
అడ్రస్: District Medical and Health Officer, East Godavari District, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.