DOT Recruitment 2022: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో ఇంటర్న్‌షిప్‌ ఖాళీలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌కు చెందిన టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్‌.. టెక్‌ ఇంటర్‌షిప్ స్కీమ్ కింద 25 ఇంటర్న్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..

DOT Recruitment 2022: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో ఇంటర్న్‌షిప్‌ ఖాళీలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
Department of Telecommunications

Updated on: Oct 04, 2022 | 3:43 PM

న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌కు చెందిన టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్‌.. టెక్‌ ఇంటర్‌షిప్ స్కీమ్ కింద 25 ఇంటర్న్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిక్స్‌డ్‌ యాక్సెస్, ఫ్యూచర్‌ నెట్‌వర్క్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీస్‌, మొబైల్‌ టెక్నాలజీస్‌, నెక్ట్స్‌ జెనెరేషన్ స్విచ్చింగ్‌, రేడియో, స్మార్ట్‌ నెట్‌వర్క్స్‌, స్టాండర్డైజేషన్‌, ట్రాన్స్‌మిషన్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. మొత్తం 6 నెలలపాటు ఇంటర్న్‌షిప్‌ కొనసాగుతుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్స్/ టెలికమ్యూనికేషన్/ రేడియో/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్స్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లో బ్యాచిరర్స్‌ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Department of Telecommunications
TELECOMMUNICATION ENGINEERING CENTRE
Khurshid Lal Bhawan, Janpath, New Delhi – 110001.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.