
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) పీజీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 14 నుంచి ప్రారంభమైనాయి. అయితే నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 14వ తేదీ రాత్రి 11.50 గంటలతో ముగిశాయి. ఈ క్రమంలో ఎన్టీయే ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు జనవరి 20, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
ఇక మార్చిలో జరగనున్న ఆన్‌లైన్ రాత పరీక్షలు దేశ వ్యాప్తంగా 276 నగరాల్లో, విదేశాల్లోని 16 నగరాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 157 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. సీయూఈటీ పీజీ టెస్ట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇందులో కేంద్రం ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి వర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి వయోపరిమితి లేదు. అయితే అప్లికేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.1400, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ/ ఎస్టీ/ థర్డ్‌జెండర్ అభ్యర్థులు రూ.1100, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
రాత పరీక్ష మొత్తం 74 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. వ్యవధి 90 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
సీయూఈటీ పీజీ 2026 ప్రవేశాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.