
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (CSIR-UGC NET) ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత లేదా పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నుంచి కీలక సమాచారం. జూన్-2026 సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా, ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. సైన్స్ విభాగాల్లో ఉన్నత విద్య, పరిశోధన లేదా బోధనా రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే వారికి ఇది కీలక అవకాశం.
ఈసారి మొత్తం ఐదు ప్రధాన సైన్స్ విభాగాల్లో పరీక్ష జరగనుంది.
ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు జేఆర్‌ఎఫ్ పొందడంతో పాటు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా అర్హత సంపాదించవచ్చు.
అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అయితే కింది వర్గాలకు మార్కుల విషయంలో సడలింపు ఉంటుంది.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయస్సు జులై 2026 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత లేదా పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం అప్లై చేసే వారికి గరిష్ఠ వయోపరిమితి లేదు.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1,150 ఫీజు చెల్లించాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ (EWS), ఓబీసీ (నాన్ క్రీమిలేయర్) అభ్యర్థులకు రూ.600 ఫీజు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwD), థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.325 చెల్లిస్తే సరిపోతుంది.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు.
ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక సిలబస్, మార్కింగ్ విధానం ఉంటుంది.
దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేయాలనుకునే వారికి సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ కీలక అర్హత పరీక్షగా గుర్తింపు పొందింది. జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన వారికి ఫెలోషిప్‌తో పాటు పరిశోధనలో ఆర్థిక సహాయం లభిస్తుంది. అదే సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కూడా పొందే అవకాశం ఉండటంతో, అకాడమిక్ రంగంలో కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఈ పరీక్ష ఎంతో ఉపయోగపడుతుంది.
దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి