CLAT 2026 Results: మరికొన్ని గంటల్లో క్లాట్‌ 2026 పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

దేశవ్యాప్తంగా 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 పరీక్ష డిసెంబర్‌ 7వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు పరీక్ష..

CLAT 2026 Results: మరికొన్ని గంటల్లో క్లాట్‌ 2026 పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
CLAT 2026 Results date and time

Updated on: Dec 16, 2025 | 7:31 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 16: దేశవ్యాప్తంగా 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 పరీక్ష డిసెంబర్‌ 7వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎమ్‌ఆర్‌ ఆధారితంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. క్లాట్‌ పలితాల తేదీని నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలు డిసెంబర్ 17న వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు రిజల్ట్స్‌ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ పరీక్షను నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లా ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ఏటా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తారు. కాగా నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో ఏటా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తున్నాయి. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాంలు (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) అందిస్తున్నాయి. క్లాట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం (యూజీ, పీజీ, డిగ్రీ) ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అండర్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు పొందిన వారికి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ పూర్తి చేయవల్సి ఉంటుంది. పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు పొందిన వారు ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ పూర్తి చేయవల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

క్లాట్‌-2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఐసీఎస్‌ఐ 2025 అడ్మిట్‌ కార్డులు విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ICSI) సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రొఫెషనల్స్‌ పరీక్ష డిసెంబర్‌ 2025 అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు హాల్‌టికెట్స్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ నమోదు చేసి icsi.edu అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 22 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఐసీఎస్‌ఐ 2025 అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us