CIPET Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివి ఖాళీగా ఉన్నారా? సీపెట్‌లో నెలకు రూ.78,800ల జీతంతో ఉద్యోగావకాశాలు..

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీ-పెట్).. 21 సూపర్‌వైజరీ (టెక్నికల్ అండ్‌ నాన్-టెక్నికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

CIPET Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివి ఖాళీగా ఉన్నారా? సీపెట్‌లో నెలకు రూ.78,800ల జీతంతో ఉద్యోగావకాశాలు..
CIPET Chennai Recruitment 2022

Updated on: Nov 24, 2022 | 5:35 PM

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీ-పెట్).. 21 సూపర్‌వైజరీ (టెక్నికల్ అండ్‌ నాన్-టెక్నికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 30, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.78,800ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

సూపర్‌వైజరీ (టెక్నికల్ అండ్‌ నాన్-టెక్నికల్) పోస్టుల వివరాలు..

  • మేనేజర్ (టెక్నికల్) పోస్టులు: 4
  • సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టులు: 6
  • టెక్నికల్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టులు: 10
  • మేనేజర్ (పీ&ఎ) (నాన్-టెక్నికల్) పోస్టులు: 1

అడ్రస్..

Director (Administration), CIPET Head Office, T.V.K. Industrial Estate, Guindy, Chennai– 600 032.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us