AP SSC Hindi Paper Leak 2022: ఇది లీక్ కాదు.. పరీక్ష ప్రారంభమైన గంటకి వాట్సప్‌లో సర్కులేట్‌ అయ్యింది: డీఈఓ

|

Apr 28, 2022 | 4:46 PM

నేడు హిందీ పేపర్ పరీక్ష ప్రారంభమైన కాసేటపటికే సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్‌ అయ్యింది. ఈ ఘటనపై చిత్తూరు, తిరుపతి జిల్లాల డీఈఓలు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు డీఈవో పురుషోత్తం (DEO Purushottam)మీడియాతో మాట్లాడుతూ..

AP SSC Hindi Paper Leak 2022: ఇది లీక్ కాదు.. పరీక్ష ప్రారంభమైన గంటకి వాట్సప్‌లో సర్కులేట్‌ అయ్యింది: డీఈఓ
Paper Leak
Follow us on

AP 10th class question paper leak news: ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనున్న వెదురుకుప్పం మండలంలోని తిరుమలయ్య పల్లి హైస్కూల్ సెంటర్ నుంచి నేడు హిందీ పేపర్ పరీక్ష ప్రారంభమైన కాసేటపటికే సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్‌ అయ్యింది. ఈ ఘటనపై చిత్తూరు, తిరుపతి జిల్లాల డీఈఓలు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు డీఈవో పురుషోత్తం (DEO Purushottam)మీడియాతో మాట్లాడుతూ.. హిందీ ప్రశ్నాపత్రం లీకయిందన్న వదంతిపై విచారణ చేపట్టాం… మా విచారణలో పరీక్ష ప్రశ్నాపత్రం, పరీక్ష ప్రారంభమైన గంట సమయం తర్వాత వాట్సాప్ లో సర్కులేట్ అయ్యినట్లు గుర్తించాం.. ఇది లీక్ కాదు. బాధ్యులను గుర్తించేందుకు పోలీసు విచారణ జరుగుతోందని తెలిపారు.

కాగా పదో తరగతి పరీక్షల్లో వరుస పేపర్ లీక్‌లతో సర్వత్రా చర్చ కొనసాగుతోంది. నిన్న (ఏప్రిల్‌27) శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షలంత్రి పరీక్షా సెంటర్‌లో తెలుగు పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రత్యక్షమైంది. అయితే సాయంత్రానికే ఈ పేపర్ లీక్‌లు అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో 11 గంటల సమయానికి సర్క్యులేట్ అయినట్టుగా గుర్తించినట్లు చెప్పారు. పదో తరగతి పరీక్ష 9.30 గంటలకే ప్రారంభమైందని.. కావున దీన్ని లీక్‌గా భావించలేమని చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. పశ్నపత్రం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వ్యక్తిని అరెస్టు చేశామన్నారు.

ఈ రోజు కూడా హిందీ పేపర్‌ లీకేజీ వార్తలు సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొట్టడంతో చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల్లో అయోమయం నెలకొంది. కరోనా ప్రభావంతో రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లతో జరుగుతున్నాయి. ఈ ఏడాది మొత్తం 6,22,537మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 3,776 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.

Also Read:

ONGC Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త! ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కంపెనీలో 3614 అప్రెంటీస్‌ ఖాళీలు..