Central Silk Board Scientist B Recruitment 2022: భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డు (CSB).. మొత్తం 66 సైంటిస్ట్ బి (Scientist B Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ, సెరీ కల్చర్, మైక్రోబయాలజీ, ప్లాంట్ సైకాలజీ, సాయిల్ సైన్సెస్, ఫాం కెమిస్ట్రీ అండ్ పవర్ ఇంజనీరింగ్ వంటి తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. సైన్స్ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా అగ్రికల్చర్ సైన్సెస్ విభాగాల్లో పీజీ డిగ్రీ కలిగిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 19, 2022 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.