
హైదరాబాద్, మార్చి 23: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI).. రెగ్యులర్ ప్రాతిపదికన ఇటీవల హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ విభాగంలో వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తుంది. మార్చి 23 (సోమవారం)తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు దరఖాస్తు సమయం ముగిసేలోపు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సెంట్రల్ ఆఫీస్‌లోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ విభాగం ద్వారా జరుగుతున్న ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో సాఫ్ట్‌వేర్ డెవలపర్, మొబైల్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ, డేటా ఆర్కిటెక్ట్, డేటా సైంటిస్ట్, ఐటీ ఆఫీసర్, రిస్క్ మేనేజర్ వంటి ఐటీ నిపుణుల వంటి తదితర పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనల మేరకు పోస్టును బట్టి 2 నుంచి 10 సంవత్సరాల పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.850+175 (జీఎస్టీ) రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.1,20,940ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష తేదీ ఏప్రిల్ 2026లో ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.