CBSE 12th Result 2021 Topper List: సీబీఎస్ఈ బోర్డు ఫలితాల్లో టాపర్స్ వీరే.. పూర్తి వివరాలు మీకోసం..

|

Jul 30, 2021 | 3:37 PM

CBSE 12th Result 2021 Topper List: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి..

CBSE 12th Result 2021 Topper List: సీబీఎస్ఈ బోర్డు ఫలితాల్లో టాపర్స్ వీరే.. పూర్తి వివరాలు మీకోసం..
Cbse
Follow us on

CBSE 12th Result 2021 Topper List: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది సిబిఎస్‌ఇ ఫలితాల్లో 99.37 శాతం ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన ‘‘cbse.nic.in’’ ద్వారా చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా, కోవిడ్ 19 వైరస్ కారణంగా సీబీఎస్ఈ బోర్డు ప్లస్ 2 పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. పరీక్షలు నిర్వహించకుండానే.. స్కూళ్లలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. కాగా, గడిచిన కొన్నేళ్ల ఫలితాలను పరిశీలించినట్లయితే.. ఈసారి విడుదల ఫలితాల్లో విద్యార్థులు దాదాపుగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. బాలికలు, బాలుర మధ్య ఉత్తీర్ణత శాతంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. బాలుర కంటే బాలికలు 0.54 శాతం మాత్రమే మించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 99.67 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత శాఖ 99.13 శాతం. ఇక 2020లో సీబీఎస్ఈ ఉత్తీర్ణత శాతం 88.78 శాతంగా ఉంది. దాని ప్రకారం దేశ వ్యాప్తంగా 10,59,080 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

అయితే, సీబీఎస్ఈ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో టాపర్‌గా విద్యార్థిని దివ్యాన్షి జైన్ (లక్నోలోని నవయుగ్ రేడియన్స్ సీనియర్ సెంకడరీ స్కూల్) నిలిచింది. 600/600 మార్కులు సాధించింది. ఈమే మాత్రమే కాదు.. తుషార్ సింగ్ కూడా టాప్‌లో నిలిచాడు. డీపీఎస్ బులంద్ షహర్ కు చెందిన తుషార్ సింగ్ 600/600 స్కోర్ సాధించి దివ్యాన్షితో టాప్ ప్లేస్‌ని షేర్ చేసుకున్నాడు. ఇక ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే.. 97.67 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్ర అగ్రస్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో బెంగళూరు ఉంది. ఆ తరువాత మూడవ స్థానంలో చెన్నై నిలిచింది.

వీరు మాత్రమే కాదు.. వికలాంగ విద్యార్థులు ఎంతో మంది అద్భుతమైన మార్కులు సాధించారు. స్పాస్టిక్ హెమిప్టేజియాతో బాధపడుతున్న పాలక్ గుప్తా(అమిటి ఇంటర్నేషనల్ స్కూల్-ఢిల్లీ) 95.4 శాతం మార్కులు సాధించింది. జాతీయ స్థాయి షూటర్ అయిన డైస్లెక్సియా వ్యాధి బారిన పడదిన రియా నేగి 90.6 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

కాగా, సీబీఎస్ఈ ఫలితాలను.. 10వ తరగతి మార్కుల్లో 30 శాతం, 11వ తరగతి తుది ఫలితాల్లో 30 శాతం, 12వ తరగతిలో యూనిట్ పరీక్ష/మిడ్-టర్న్/ ప్రీ-బోర్డు పరీక్ష ఆధారంగా 40 శాతం వెయిటేజీ ఇవ్వడం జరిగింది.

Also Read:

Bandi Sanjay: ప్రగతి భవన్‌ను పేదలకు పంచుతాం.. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Tokyo Olympics 2021 Live Updates: హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో పీవీ సింధుగెలుపు.. సెమీస్ లోకి అడుగు

Pawan Kalyan – Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ