Trainee Pilot Cabinet Secretariat: కేబినేట్ సెక్రటేరియట్ ట్రైయినీ పైలట్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వానికి చెందిన కేబినేట్ సెక్రటేరియట్ గ్రూప్ ఏ గెజిటెడ్ విభాగంలో ట్రెయినీ పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తలు స్వీకరణకు రేపటితో (28-03-2022) ముగియనున్న నేపథ్యంలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ట్రెయినీ పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణతో పాటు డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్/ హెలికాప్టర్ పైలట్ కమర్షియల్ లైసెన్స్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను పోస్ట్ బ్యాగ్ నెం. 3003, లోదీ రోడ్ హెడ్ పోస్టాఫీస్, న్యూఢిల్లీ 110003 అడ్రస్‌కు పంపించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100తో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.
* అభ్యర్థులను ఫ్లైట్ క్రూ లైసెన్స్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: తగ్గేదేలే.! లంచం తీసుకోవడంలో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టైలే వేరయా.. వీడియో చూస్తే షాకే!
KGF chapter 2 Trailer: మరోసారి అదరగొట్టిన రాకీ.. దుమ్మురేపుతున్న “KGF చాప్టర్ 2” ట్రైలర్..