C-DAC Recruitment 2023: ఇంజనీరింగ్ అర్హతతో కేంద్ర కొలువులు సొంతం చేసుకునే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పూణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన 63 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

C-DAC Recruitment 2023: ఇంజనీరింగ్ అర్హతతో కేంద్ర కొలువులు సొంతం చేసుకునే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
C-DAC Pune

Updated on: May 14, 2023 | 1:26 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పూణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన 63 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎస్‌ఓసీ అనలిస్ట్, టెక్నికల్ హెల్ప్‌డెస్క్, నెట్‌వర్క్ అడ్మిన్, సర్వర్/ స్టోరేజ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, టెక్నికల్ హెల్ప్‌డెస్క్ లీడ్, ఆపరేషన్స్ మేనేజర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారు ఢిల్లీతోపాటు దేశంలోని వివిధ సీడ్యాక్‌ కేంద్రాల్లో పని చేయవల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/పోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 24, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us