JNTU Sem Exams 2022: బీటెక్, ఎంటెక్‌ విద్యార్థులకు జేఎన్టీయూ కీలక ప్రకటన.. అటెండెన్స్‌ మినహాయింపుకు ఓకే!

|

Jun 01, 2022 | 4:42 PM

తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. అటెండెన్స్‌ షార్టేజ్‌ సమస్యకు మినహాయింపునిస్తూ జేఎన్టీయూ (JNTU) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది..

JNTU Sem Exams 2022: బీటెక్, ఎంటెక్‌ విద్యార్థులకు జేఎన్టీయూ కీలక ప్రకటన.. అటెండెన్స్‌ మినహాయింపుకు ఓకే!
Jntu
Follow us on

JNTU decided to give exemption from minimum attendance: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. అటెండెన్స్‌ షార్టేజ్‌ సమస్యకు మినహాయింపునిస్తూ జేఎన్టీయూ (JNTU) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాజరు ఆధారిత డిటెన్షన్‌ విధానం నుంచి మినహాయింపు ఇస్తూ జేఎన్‌టీయూ ఈ మేరకు ప్రకటించింది. ఇది ప్రస్తుత సెమిస్టర్‌కు వర్తిస్తుందని రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ మే 31 (మంగళవారం)న ఆదేశాలు జారీ చేశారు. దీంతో జులైలో జరిగే బీటెక్, ఎంటెక్‌ సెమిస్టర్‌ పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలకు కనీస హాజరు (minimum attendance)తో సంబంధం లేకుండా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది. కోవిడ్‌ సమయంలో అనుసరించిన పరీక్ష విధానం ప్రకారంగానే ఎక్కువ ఛాయిస్‌లు ఉండే విధంగా తాజా సెమిస్టర్‌ పరీక్షలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెల్పింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.