BRBNMPL Bangalore Deputy Manager Recruitment 2022: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL Bangalore).. 17 డిప్యూటీ మేనేజర్ (ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), అసిస్టెంట్ మేనేజర్(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్) తదితర పోస్టుల (Deputy Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఈ/ బీటెక్/ సీఏ/ సీఎంఏ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పోస్టును బట్టి అభ్యర్ధుల వయసు 31, 37, 45, 52 ఏళ్లు ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబర్ 8, 2022 తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.56,000ల నుంచి రూ.23,59,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
అడ్రస్: The CFO cum CS, Bharatiya Reserve Bank Note Mudran Private Limited No.3 & 4, I Stage, I Phase, B.T.M. Layout, Bannerghatta Road
Post Box No. 2924, D.R. College P.O., Bengaluru – 560 029.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.