BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. రూ. 90 వేలకు పైగా జీతం పొందే అవకాశం..

|

Jul 01, 2021 | 7:47 PM

BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన..

BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. రూ. 90 వేలకు పైగా జీతం పొందే అవకాశం..
Bsf Jobs
Follow us on

BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్, అసిస్టెంట్‌ రేడియో మెకానిక్, కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విబాగంలో డిప్లొమా చేసి ఉండాలి.
* అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* స్టోర్‌మెన్‌ విభాగంలో కానిస్టేబుల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.29,000 నుంచి రూ.92,300 వరకు చెల్లిస్తారు.
* అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.29,000 నుంచి రూ.92,300 వరకు జీతంగా పొందొచ్చు.
* కానిస్టేబుల్‌(స్టోర్‌మెన్‌) పోస్టుకు ఎంపికైన వారికి రూ.21,700 నుంచి రూ.69,100 వరకు నెలకు జీతంగా అందిస్తారు.
* ఇక వయసు విషయానికొస్తే పోస్టులను అనుసరించి అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 24.07.2021ని నిర్ణయించారు.
* పూర్తివివరాల కోసం బోర్డ్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://bsf.gov.inను సందర్శించాలి.

Also Read: TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తుల గడువు పెంచుతూ నిర్ణయం..

Indian Coast Guard: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.

Osmania University Exams: ఓయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ 3, 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..