BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం.

|

Aug 20, 2021 | 9:33 PM

BHEL Recruitment: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న..

BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం.
Bhel Jobs
Follow us on

BHEL Recruitment: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న పలు యూనిట్లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. గత బుధవారం (ఆగస్టు 18) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 27 సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* మెడిసిన్‌, అనెస్తీషియా, రేడియాలజీ, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో ఏడాది అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 01-08-2021 నాటికి 37 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను తొలుత అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ. 70,000 నుంచి రూ. 200000 వరకు జీతంగా అందిస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 18-08-2021న ప్రారంభంకాగా 07-09-2021న ముగియనుంది.
* దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: ECIL: ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

NIT Recruitment: వరంగల్‌ నిట్‌లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. బీటెక్ చేసిన వారికి కూడా అవకాశం. ఎలా అప్లై చేసుకోవాలంటే.

Anganwadi Jobs: టెన్త్ పాసై.. ఉద్యోగం కోసం చూస్తున్న వివాహిత మహిళలకు గుడ్ న్యూస్.. 288 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్