BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్ యూనిట్‌లో పలు విభాగాల్లో ప్రాజెక్టు ఇంజనీర్ భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 49 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల్లో భాగంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో 36 పోస్టులు, మెకానికల్ విభాగంలో 08, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 04, హ్యూమన్ రిసోర్సెస్ 01 ఖాళీలున్నాయి.
* పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్), హ్యూమన్ రిసోర్స్ స్పెషలైజేషనత్‌లో ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంహెచ్‌ఆర్‌ఎం/ఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థులను అకడమిక్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 04-08-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: విద్యావ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి 12 తరగతుల వరకు స్కూల్ ఎడ్యుకేషన్..