భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ (బెల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషణ్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో మొత్తం 27 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే క్యాండిడేట్స్ సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. క్యాండేంట్స్ వచే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల జీతాన్ని ఇస్తారు.
అభ్యర్థులు రూ. 472 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న క్యాండిడేట్స్ ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తులను మేనేజర్ (హెచ్ఆర్/ఏడిఎస్ఎన్, ఈఎస్ అండ్ సి-క్యూఏ) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహళ్లి పోస్టు ఆఫీస్, బెంగళూరు 560013 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్స్‌కు జుల్ 20వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. పూర్తి వివరాలు, దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..